చైన్‌స్నాచర్‌ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చైన్‌స్నాచర్‌ అరెస్టు

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

ఎల్లమ్మ ఆలయంలో చోరీ

మోర్తాడ్‌(బాల్కొండ): మెండోరా పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన చైన్‌ స్నాచింగ్‌ కేసులో నిందితుడు గుర్జంత్‌ సింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆర్మూర్‌ రూరల్‌ సీఐ జాన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. బాల్కొండలోని రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజుల క్రితం సోన్‌పే ట్‌కు చెందిన ఉప్పరి గణేశ్‌ తన భార్య గంగు, కూతురు మనీషతో కలిసి ముప్కాల్‌ నుంచి బుస్సాపూర్‌ శివారుకు చేరుకోగా ముసుగు ధరించిన దొంగ గంగు మెడలో నుంచి రెండు తులాల పుస్తెల తాడు తెంచుకొని పారిపోయాడు. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన గుర్జంత్‌ సింగ్‌గా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎస్సై సుహాసిని ఆధ్వర్యంలో సిబ్బంది నరేందర్‌, భరత్‌గౌడ్‌, లింగన్న నిందితుడిని పట్టుకొని బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మెండోరా పోలీసులను సీఐ అభినందించారు.

వర్ని: మోస్రా మండలం గోవూరు గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి వెండి ఆభరణాలను అపహరించినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఆలయంలోని బీరువాను పగులగొట్టి 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement