ఎల్లారెడ్డి రూరల్: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి నిపుణుడు హరికిషన్ రావు ఆధ్వర్యంలో 41 మంది రోగులకు పరీక్షలు చేశారు. వీరిలో ఇద్దరికి సర్జరీ కోసం హైదరాబాద్ సరోజినీదేవి ఆస్పత్రికి, ఏడుగురిని క్యాటరాక్ట్ ఆపరేషన్ నిమిత్తం బాన్స్‌వాడ లయన్స్ క్లబ్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. 21 మంది రోగులకు కంటి అద్దాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ పర్యవేక్షించారు.


