రెడ్డి సంఘాల ఐక్యవేదిక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కరుణాకర్‌ రెడ్డి | - | Sakshi
Sakshi News home page

రెడ్డి సంఘాల ఐక్యవేదిక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కరుణాకర్‌ రెడ్డి

Jun 5 2026 1:12 AM | Updated on Jun 5 2026 1:12 AM

రెడ్డి సంఘాల ఐక్యవేదిక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కరుణాకర్‌ రెడ్డి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రతి ఇంట్లో మొక్కలు నాటండి

కామారెడ్డి అర్బన్‌: తెలంగా ణ రెడ్డి సంఘాల ఐక్య వేది క రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నల్లవెల్లి కరుణాకర్‌ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి నియామక పత్రం అందజేశారు. రెడ్డి సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోగా కామారెడ్డి జిల్లాకు చెందిన కరుణకర్‌రెడ్డి మూడోసారి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, ప్రతినిధులు గోపాల్‌రెడ్డి, రాజ్‌కుమార్‌రెడ్డి, సుమన్‌రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 1989 బ్యాచ్‌ ఎస్సెస్సీ విద్యార్థినులు గురురువా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో కార్యక్రమం నిర్వహించగా, ఏళ్ల తర్వాత మళ్లీ స్నేహితులంతా ఒక్కచోట కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకూంటూ ఆనాటి తీపి గుర్తులను నెమరువేసుకున్నారు. విందువినోదాలతో ఆనందంగా గడిపారు.

ఎల్లారెడ్డి రూరల్‌: తిమ్మారెడ్డి గ్రామంలో గురువారం వన సంరక్షణ, జల సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌ కోల రాములు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ప్రజలు ప్రతీ ఇంట్లో రెండు మొక్కలు నాటాలని సర్పంచ్‌ ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement