భిక్కనూరు: రక్తపరీక్షలతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం ఆయన భిక్కనూరు ప్రభుత్వాస్పత్రిలో రక్త పరీక్ష కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళ రక్త పరీక్షలు చేయించుకోవాలని, దీనివల్ల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో చేపడుతున్న కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువవుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖాధికారి రవీందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, సర్పంచ్ బల్యాల రేఖ, తహసీల్దార్ సునీత, డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి, అడిషనల్ డీఆర్‌డీవో విజయలక్ష్మి, వైద్యులు యెమిమా, ఈవో మహేష్‌గౌడ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


