న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026
– 8లో u
V/s
అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత
పోరు ముదిరిపాకాన పడుతోంది. ఈ
పంచాయితీ గాంధీ భవన్‌కు చేరింది.
జిల్లాకేంద్రంలోని రెండు వర్గాలు
పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం
జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధాన వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గంలో పట్టు కోసం సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్గంతోపాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి వర్గాలు కృషి చేస్తున్నాయి. ఇరు వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
వైకుంఠధామం విషయంలో..
కామారెడ్డి పట్టణంలోని శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. అయితే అవసరమైన అనుమతులు ఇచ్చే విషయంలో బల్దియా పాలకవర్గం నాన్చివేత ధోరణితో వ్యవహరించడంపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ విమర్శలు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఉద్దేశించినవేనంటూ ఆయన వర్గం నేతలు గతనెల 31వ తేదీన గాంధీభవన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు.
చంద్రశేఖర్‌రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ
షబ్బీర్ అలీ వర్గం ఇచ్చిన ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పీసీసీ క్రమశిక్షణ కమిటీ గురువారం గడ్డం చంద్రశేఖర్‌రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. బహిరంగంగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, క్రిమినల్ కేసుల్లో ప్రమేయం కలిగి ఉండడం, సీనియర్ నాయకుడి ప్రతిష్టకు, కాంగ్రెస్ ఇమేజ్‌కు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలపై ఈనెల 11 వ తేదీలోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని టీపీసీసీ డీఏసీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ నోటీసులు జారీ చేశారు.
చర్చనీయాంశంగా వర్గపోరు..
అధికార పార్టీలో నెలకొన్న వర్గపోరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇరు వర్గాలు త్రీవ స్థాయిలో పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంపై పా ర్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. షబ్బీర్ అలీ వర్గం ఫిర్యాదుతో స్పందించిన పార్టీ క్రమశిక్షణ సంఘం.. చంద్రశేఖరరెడ్డికి షోకాజ్ నోటీసు లు జారీ చేసింది. చంద్రశేఖరరెడ్డి వ ర్గం ఇచ్చిన ఫిర్యా దులపై ఎలా స్పందిస్తుందోన న్న విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.
గాంధీ భవన్‌కు చేరిన
కాంగ్రెస్ పంచాయితీ
పరస్పర ఫిర్యాదులతో వేడెక్కిన
రాజకీయం
జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన
హస్తంలో అంతర్గత పోరు


