జిల్లా రవాణా అధికారిగా సంతోష్‌ కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా రవాణా అధికారిగా సంతోష్‌ కుమార్‌

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

కామారెడ్డి క్రైం: జిల్లా రవాణా అధికారిగా సంతోష్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఇ క్కడ ఇన్‌చార్జి డీటీవోగా విధులు నిర్వర్తించి న శ్రీనివాస్‌ వరంగల్‌కు బదిలీపై వెళ్లారు. ఆ యన స్థానంలో మంచిర్యాలలో ఎంవీఐగా పనిచేస్తున్న సంతోష్‌కుమార్‌ పదోన్నతిపై కామారెడ్డికి వచ్చారు.

జిల్లా రవాణా శాఖలో ఖాళీగా ఉన్న రెండు ఎంవీఐ పోస్టులను భర్తీ చేశారు. సిద్దిపేట నుంచి శంకర్‌ నారాయణ, ఆదిలాబాద్‌ నుంచి ప్రదీప్‌ కుమార్‌ బదిలీపై వచ్చారు. డీటీ వో, ఇద్దరు ఎంవీఐలు గురువారం బాధ్యత లు స్వీకరించిన అనంతరం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

డీడబ్ల్యూవో బదిలీ

కామారెడ్డి క్రైం: జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి ప్రమీల ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. అమె స్థానంలో ఎల్లారెడ్డి ఏసీడీపీవోగా పనిచేస్తున్న ప్రసన్నకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఆమె బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్‌ను కలిశారు. బదిలీపై వెళ్తున్న డీడబ్ల్యూవో ప్రమీలను కలెక్టర్‌ సత్కరించారు.

‘నిరంతరం మిల్లింగ్‌

జరిగేలా చూడాలి’

భిక్కనూరు : సీఎంఆర్‌ పెండింగ్‌ల నివారణ కు నిరంతరం మిల్లింగ్‌ జరిగేలా చూడాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి వెంకేటేశ్వ ర్లు రైస్‌మిల్లర్లకు సూచించారు. గురువారం ఆయన భిక్కనూరు, రామేశ్వర్‌పల్లి గ్రామా ల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024–2025 రబీ, ఖరీఫ్‌, 2025–2026 రబీ సీజన్‌కు సంబంధించిన పెండింగ్‌ సీఎంఆర్‌ ను పూర్తి చేసేందుకు మిల్లింగ్‌ యూనిట్లను నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఆ యన వెంట పౌరసరఫరాలశాఖ జిల్లా మేనే జర్‌ శ్రీకాంత్‌, డిప్యూటీ తహసీల్దార్‌ కిష్టయ్య తదితరులు ఉన్నారు.

‘తొలిరోజే పాఠ్య

పుస్తకాలు అందించాలి’

కామారెడ్డి టౌన్‌ : ప్రభుత్వ పాఠశాలల వి ద్యార్థులకు నూతన విద్యాసంవత్సరం ప్రా రంభం రోజే పాఠ్యపుస్తకాలు అందేలా చూ డాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్‌.మల్లికార్జున్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పాఠ్యపుస్తకాల గోదాంను గురువారం ఆయన సందర్శించి, పుస్తకాల నిల్వ లు, పంపిణీ రికార్డులను పరిశీలించారు. పా ఠశాలలకు పుస్తకాల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూసుకోవాలని, మండలాల వారీగా కేటాయింపులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించా రు. ఆయన వెంట పాఠ్యపుస్తకాల నోడల్‌ అధికారి సిద్ధిరాంరెడ్డి, ఇన్‌చార్జి మేనేజర్‌ గిరిప్రసాద్‌ తదితరులున్నారు.

నాణ్యమెన విత్తనాలను విక్రయించాలి

తాడ్వాయి: నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆయన గురువారం తాడ్వాయి, దేమికలాన్‌, ఎర్రాపహాడ్‌ గ్రామాలలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. నిర్ణీత ధరలకే రైతులకు ఎరువులు, విత్తనాలను విక్రయించాలన్నారు. రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని దుకాణాల నిర్వాహకులకు సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏవో నర్సింలు తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement