గ్రామసభలతో సమస్యలకు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

గ్రామసభలతో సమస్యలకు పరిష్కారం

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలి

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

దోమకొండ: గ్రామసభల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. గురువారం గొట్టిముక్కులలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 532 గ్రామపంచాయతీలలో నాలుగు విడతలలో ప్రత్యేక గ్రామసభలను నిర్వహిస్తున్నామన్నారు. గురువారం జిల్లాలోని 136 గ్రామాల్లో సభలు నిర్వహించామని, 6, 8, 10 తేదీలలో మిగిలిన చోట్ల గ్రామసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ముందస్తు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో వ్యాధు లను దూరంగా ఉంచవచ్చన్నారు. ఆకుపచ్చ రంగు బుట్టలో తడి వ్యర్థాలు, నీలం రంగు బుట్టలో పొడి వ్యర్థాలు, ఎరుపు రంగు బుట్టలో శానిటరీ వ్యర్థాలు, నల్ల రంగు బుట్టలో ప్రత్యేక వ్యర్థాలను వేరు చేసి గ్రామపంచాయతీకి అందించాలని ప్రజలకు సూచించారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని, ఆయిల్‌పాం సాగుకు మొగ్గు చూపా లని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపునకు అందరూ సహకరించాలన్నా రు. ప్రత్యేక ఓటరు స వరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో సర్పంచ్‌ సంజీవ్‌, జిల్లా పంచాయతీ అధికారి మురళి, డీఎల్‌పీవో శ్రీనివాస్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమా ర్‌, తహసీల్దార్‌ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement