షబ్బీర్‌ అలీపై ఫిర్యాదు.. | - | Sakshi
Sakshi News home page

షబ్బీర్‌ అలీపై ఫిర్యాదు..

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డికి నోటీసులు జారీ అయిన రోజే ఆయన వర్గం సైతం షబ్బీర్‌ అలీపై పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మామిండ్ల అంజయ్య, కామారెడ్డి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గడ్డం ఇందుప్రియ గురువారం మల్లు రవిని కలిసి ఫిర్యాదు ఇచ్చారు. షబ్బీర్‌ అలీ కామారెడ్డిలో పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకుంటున్నారని, గత ఎన్నికల్లో ఆయన సరిగా పనిచేయకపోవడం వల్లే రేవంత్‌రెడ్డి ఓడిపోయారని పేర్కొన్నారు. షబ్బీర్‌ అలీ కుటుంబంలోని వ్యక్తులు నియోజకవర్గంలో అరాచకాలు సాగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించడానికి షబ్బీర్‌ అలీ కుటుంబం కుట్రలు చేసిందని, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అభ్యర్థి వద్ద డబ్బులు తీసుకుని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠం కట్టబెట్టారని ఆరోపణ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement