కలెక్టరేట్ వద్ద 82 ఎంఎం
వర్షపాతం నమోదు
కామారెడ్డి క్రైం: జిల్లాలోని పలు ప్రాంతాలలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలో దాదాపు 45 నిమిషాల పాటు వాన పడింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కలెక్టరేట్ వద్ద 82 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. భిక్కనూరులో 71.3, దోమకొండలో 56, పాతరాజంపేటలో 39.8, పాల్వంచ మండలం ఎల్పుగొండలో 24.8, రామారెడ్డిలో 10, సదాశివనగర్‌లో 9.8, పిట్లంలో 7, బిచ్కుందలో 5.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి చుట్టుపక్కల భారీ వర్షం కురియడంతో పలు కొనుగోలు కేంద్రాల్లో గోదాములకు తరలించడానికి సిద్ధంగా ఉన్న వరి, మక్క, జొన్న బస్తాలు, కుప్పలు తడిసిపోయాయి.


