కామారెడ్డి క్రైం: జిల్లాలో మక్కల కొనుగోళ్లను మూడు రోజుల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో మక్కలు, జొన్నల సేకరణపై సమీక్ష నిర్వహించారు. జొన్నల కొనుగోళ్లను సైతం వేగవంతం చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో గోదాములకు తరలించి నిల్వ చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 39,903 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 20,718 మెట్రిక్ టన్నుల జొన్నలను సేకరించామన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ విక్టర్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ క్రాంతి, డీఏవో మోహన్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


