జొన్నల కొనుగోళ్లను పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

జొన్నల కొనుగోళ్లను పూర్తి చేయాలి

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

జొన్నల కొనుగోళ్లను పూర్తి చేయాలి

గాంధారి: వర్షాకాలం సమీపిస్తున్నందున జొన్నల కొనుగోళ్లు చేపట్టి వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ విక్టర్‌ సూచించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డును సందర్శించారు. వడ్లు, మక్కలు, జొన్నల కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొతంగల్‌ కలాన్‌, గుర్జాల్‌లలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కాంటా చేసిన బస్తాలను తరలించేందుకు వీలైనంత తొందరగా లారీలను పంపిస్తామన్నారు. ఆయన వెంట డీసీవో రామ్మోహన్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం క్రాంతి, ఏఎంసీ చైర్మన్‌ పరమేశ్వర్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ సాయికుమార్‌, మాజీ సర్పంచ్‌ సంజీవు తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement