జిల్లాలో 88 శాతం ధాన్యం సేకరణ పూర్తి | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 88 శాతం ధాన్యం సేకరణ పూర్తి

Jun 3 2026 1:15 AM | Updated on Jun 3 2026 1:15 AM

జిల్లాలో 88 శాతం ధాన్యం సేకరణ పూర్తి బదిలీ అయిన అధికారులకు సన్మానం ‘10 నుంచి ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం అమలు’ జేఈఈ ర్యాంకర్‌కు సన్మానం ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌కు పురస్కారం

నాగిరెడ్డిపేట: జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి 88 శాతం ధాన్యం సేకరణ పూర్తయ్యిందని డీసీఎస్‌వో వెంకటేశ్‌ తెలిపారు. మంగళవారం ఆయన సివిల్‌ సప్లయ్‌ డీఎం శ్రీ కాంత్‌తో కలిసి మండలంలోని పలు కొ నుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం తరలింపులో తలెత్తుతున్న ఇబ్బందులను గురించి తెలుసుకున్నారు. అ నంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4.12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సేకరించిన వడ్లకు సంబంధించి 49,803 మంది రైతుల ఖాతాలలో రూ. 846 కోట్లు చెల్లించామన్నారు. ధాన్యం సేకరణలో కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు ధాన్యం సేకరణను పూర్తిచేస్తామన్నారు. ఆయన వెంట విజిలెన్స్‌ డీటీ సురేష్‌, ఏపీఎం రాంనారాయణగౌడ్‌, సొసైటీ సీఈవో సందీప్‌, సీసీలు నారాయణ, దత్తు తదితరులున్నారు.

కామారెడ్డి క్రైం: బదిలీపై వెళ్తున్న అధికారులను కలెక్టరేట్‌లో మంగళవారం సన్మానించారు. భూగర్భజల శాఖ అధికారి సతీశ్‌ యాదవ్‌, బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్‌ బదిలీ అయిన విషయం తెలిసిందే. వీరికి వీడ్కోలు కార్యక్రమంలో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, అదనపు కలెక్టర్లు విక్టర్‌, గిరి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం సేవలు ఈనెల 10 నుంచి అందుతాయని పీ ఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయీస్‌ హె ల్త్‌స్కీం ట్రస్ట్‌ సభ్యుడు పుల్గం దామోదర్‌రెడ్డి తె లిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో మాట్లాడారు. భార్యాభర్తలు ఉద్యోగులైతే మూల వేతనంలో 1.5 శాతం చెల్లింపు ఆప్షన్‌ ఇస్తారని, ఆందోళనకు అపోహలకు గురి కావద్దని పేర్కొన్నారు. భార్యభర్తలు, ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగి తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మొత్తం ఆరుగురికి హెల్త్‌స్కీంలో నగదు రహిత ప్రయోజనం ఉంటుందన్నారు. రెండు నెలల్లో పీఆర్సీ సాధిస్తామన్నారు. పాఠశాలల్లో సరస్వతి విగ్రహాలు, జాతీయ నాయకుల ఫొటోల తొలగింపు, కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుల నియామకం, వేతనాల తగ్గింపు అంశాలను పీఆర్టీయూ వ్యతిరేకిస్తుందన్నారు. సమావేశంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుషాల్‌, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్‌, సంతోష్‌కుమార్‌, హన్మండ్లు, నర్సారెడ్డి, రూప్‌సింగ్‌, స్వప్న, విజయ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌ : జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) పరీక్ష ఫలితాలలో ఎస్సీ కేటగిరిలో జాతీయ స్థాయిలో 182వ ర్యాంక్‌ సాధించిన సాందీపని కళాశాల విద్యార్థిని బ్రాహ్మణిని మంగళవారం కళాశాలలో సన్మానించారు. జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి షేక్‌ సలాం, కళాశాల ప్రతినిధులు ఎ.జనార్దన్‌రెడ్డి, పెంటయ్య, బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్‌గా ఎంపికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. వైస్‌ ప్రిన్సిపల్‌ కిష్టయ్య, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ప్రిన్సిపల్‌కు అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement