ప్రధాని మోదీ ద్రోహం చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ ద్రోహం చేస్తున్నారు

Jun 3 2026 1:15 AM | Updated on Jun 3 2026 1:15 AM

ప్రధాని మోదీ ద్రోహం చేస్తున్నారు

బీసీల హక్కుల కోసం

రాహుల్‌, రేవంత్‌ కృషి..

ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు

కామారెడ్డి టౌన్‌ : ‘బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అదే బీసీలకు ద్రోహం చేస్తున్నారు. అగ్రకులాలకు చెందిన నాయకులైనప్పటికీ రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిలు బీసీల అభ్యున్నతి గురించి నిరంతరం ఆలోచిస్తున్నారు’ అని ప్రభుత్వ సలహాదారు వి.హన్మంత్‌రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మా ట్లాడారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు న్యాయం జరగాలంటే వారి ఖచ్చితమైన లెక్క తేలాలని, ఇందుకోసం దేశవ్యాప్తంగా కులగణన జరగాలని రాహుల్‌ పట్టుబట్టారన్నారు. తెలంగాణలో బీసీ కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేసిందన్నారు. జనగణనలో కులగణన వద్దని కేంద్ర ప్రభుత్వం అందని, ఈ విషయమై కోర్టుకు వెళ్లగా కులగణన చేయాల్సిందేనని తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. బీజేపీకి ఎన్నికల్లో గెలవడం, భారత్‌ను హిందూదేశంగా మార్చడమే లక్ష్యాలని విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఈసీలను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుని, విపక్ష ప్రభుత్వాలను పడగొట్టేందుకు వాడుకుంటోందని ఆరోపించారు. సర్‌లో అందరూ భాగస్వాములై అర్హులందరి ఓట్లు ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌, నాయకులు మహమ్మద్‌ నయీ మ్‌, ఐరేని సందీప్‌, ఇసాక్‌ షేరు, అంజాద్‌, శ్రీనివాస్‌, చాట్ల రాజేశ్వర్‌, కన్నయ్య, లక్కపత్తిని గంగాధర్‌, పండ్ల రాజు, గంప ప్రసాద్‌, కారంగుల అశోక్‌రెడ్డి, భూమని బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement