గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలి

Jun 3 2026 1:15 AM | Updated on Jun 3 2026 1:15 AM

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి

రామకృష్ణారావు

కామారెడ్డి క్రైం: గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదికారులతో మాట్లాడారు. బుధవారం నుంచి 12 వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలపై పలు సూచనలు ఇచ్చారు. గ్రామసభల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, ప్రజల సమస్యల స్వీకరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పురోగతి తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. వీసీలో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, ఎస్పీ రాజేశ్‌ చంద్ర, అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement