క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Jun 3 2026 1:09 AM | Updated on Jun 3 2026 1:09 AM

వడదెబ్బతో మహిళ మృతి

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన ఆకుల లక్ష్మి(56) వడదెబ్బతో మృతిచెందారు. లక్ష్మి రోజూ మాదిరిగా మంగళవారం కూలీ పనికి వెళ్లారు. పని చేసేచోట వడదెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయింది. దీంతో వెంటనే కుటుంబీకులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇరువర్గాల ఘర్షణ.. కేసు నమోదు

గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని చద్మల్‌ తండాలో భూమి కోసం ఘర్షణకు పాల్పడ్డ ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్‌ మంగళవారం తెలిపారు. చద్మల్‌ తండాకు చెందిన బేల్‌సింగ్‌, జగదీశ్వర్‌ వర్గాలు చద్మల్‌ శివారులో గల భూమి కోసం పదేళ్లుగా గొడవలు పడుతున్నారు. ఇటీవలే ఇరువర్గాలు ఘర్షణ పడి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. దీంతో ఎస్సై విచారణ చేపట్టి తహసీల్దార్‌ ఎదుట ఇరువర్గాలను బైండోవర్‌ చేశారు. కానీ, అదే భూమి కోసం మంగళవారం ఉదయం ఘర్షణ పడి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలు ఫిర్యాదు చేయడంతో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

స్క్రాప్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామశివారులో ఉన్న పైపుల స్క్రాప్‌ ఫ్యాక్టరీలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం వేళ మంటలు వ్యాపించడంతో కార్మికులు, నిర్వాహకులు అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఫ్యాక్టరీ యంత్రాలు, ముడిసరుకు, స్క్రాప్‌ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రూ.కోటి వరకు నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు తెలిపారు.

డివైడర్‌ను ఢీకొని ఇద్దరికి గాయాలు

మద్నూర్‌(జుక్కల్‌): మండలంలోని సలాబత్‌పూర్‌ వద్ద జాతీయ రహదారి వంతెనపై మంగళవారం బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. జుక్కల్‌ మండలం కేంరాజ్‌కల్లాలి నుంచి దేగ్లూర్‌కు చెందిన మారుతి, రేణుక బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్‌ అదుపుతప్పింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో మద్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కిన యువకుడు

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెంది న గోస్కె ఆనంద్‌ అనే యువకుడు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్‌ చూస్తుండగా యాప్‌లో సైబర్‌ నేరగాళ్లు రూ.5000 వేలు చెల్లిస్తే రూ.99వేలు అకౌంట్‌లో చేస్తామని ఆశచూపి, వాట్సాప్‌లో స్కా నర్‌ను పంపారు. నిజమేనని నమ్మిన ఆనంద్‌ స్కా నర్‌కు రూ.5వేలు పంపించారు. కొద్దిసేపటికి వచ్చి న ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ కావడం, స్కానర్‌ డిలీట్‌ చేయ డంతో అవాక్కయ్యాడు. మోసపోయానని గుర్తించి సదాశివనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఉపాధి కూలీకి పాముకాటు

బాన్సువాడ రూరల్‌: మండలంలోని కోనాపూర్‌ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న హన్మవ్వ అనే కూలీకి పాము కాటేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో తోటికూలీలు పాముబారి నుంచి కాపాడారు. అనంతరం ఆమెను బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు.

వాహనాలు తనిఖీ

నిజాంసాగర్‌(జుక్కల్‌): మండలంలోని సుల్తాన్‌ నగర్‌ గ్రామ శివారులో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ద్విచక్రవాహనాలతో పాటు ప్రైవేట్‌ వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల ధ్రువ పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, హెల్మెట్‌లు తప్పనిసరిగా ఉండాలని పోలీసులు సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement