నిజాంసాగర్(జుక్కల్): అంతరిస్తున్న కళలకు గ్రామీణ ప్రాంత యువత జీవం పోస్తున్నారు. సోమవారం రాత్రి బ్రాహ్మణపల్లిలో రేణుకా ఎల్లమ్మ జీవిత నాటకాన్ని ప్రదర్శించారు. మూడు రోజుల నుంచి గ్రామంలో ఎల్లమ్మ ఆట ఆడుతూ చుట్టు ప్రక్క ప్రాంతాల ప్రజలను ఆకట్టుకున్నారు. రేణుకా ఎల్లమ్మ నాటక ప్రదర్శన చేసిన యువతను గ్రామ సర్పంచ్ గరబోయిన చంద్రకళ, గ్రామ పెద్దలు కిశోర్, వెంకటేశం, సాయిలు సన్మానించారు.
రాజంపేట(భిక్కనూరు): నల్లాలలో నీరు రాని రోజు గ్రామస్తులు ఫోన్ చేస్తే వెంటనే ట్యాంకర్‌తో వచ్చి నీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు మాజీ ఎంపీటీసీ సభ్యుడు అంద్యాల రమేశ్. రాజంపేట గ్రామంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లల్లోకి మంగళవారం మంచినీరు రాకపోవడంతో వారు రమేష్‌కు సమాచారం అందించగా ఆయన ట్యాంకర్‌ను తీసుకుని వచ్చి ఉచితంగా నీటిని సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చనిపోయినవారి అంత్యక్రియలకు కూడా ఉచితంగా ట్యాంకర్ ద్వారా నీరును అందజేస్తున్నానన్నారు.


