నాగిరెడ్డిపేట/లింగంపేట(ఎల్లారెడ్డి) : గతేడాది కురి సిన భారీవర్షాలతో ఎల్లారె డ్డి నియోజకవర్గంలోని లింగంపల్లి ఖుర్ధు, అడ్విలింగా ల వద్ద దెబ్బతిన్న హైలెవల్ వంతెనల పునర్నిర్మాణానికి నిధులు మంజూరుయ్యాయి. వరదల కారనంగా నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మండలం అడ్విలింగాల, లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్ధు వద్ద హైలెవల్ వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనివల్ల ఆ సమయంలో కొన్నిరోజులపాటు కేకేవై(కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి) రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైలెవల్ వంతెనలకు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు నియోజకవర్గ ప్రజల, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పలుమార్లు సంబంధితశాఖల మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈక్రమంలో అడివిలింగాల వద్ద హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.4.50కోట్లు, లింగంపల్లి ఖుర్ధు వద్ద హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.4 కోట్ల చొప్పున మొత్తం రూ.8.50కోట్ల నిధులను మంజూరుచేస్తూ రవాణా, రహదారులు, భవనాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే పనులు చేపడతామని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు తెలిపారు.


