బాన్సువాడ: వర్ని మండలం తగిలేపల్లి సర్పంచ్ అల్లం గంగవ్వతో పాటు బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం బాన్సువాడలో డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ సర్పంచ్ అల్లం గంగవ్వ, ఉప సర్పంచ్ వడ్ల గంగాప్రసాద్‌తో పాటు 50 బీఆర్‌ఎస్ గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పోచారం భాస్కర్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. వర్ని ఏఎంసీ చైర్మన్ సురేష్‌బాబా తదితరులున్నారు.


