బంగీజంప్‌..ఇలా ఎప్పుడైనా చూశారా? | Sakshi
Sakshi News home page

బంగీజంప్‌..ఇలా ఎప్పుడైనా చూశారా?

Published Fri, Mar 19 2021 3:56 PM

Russian Daredevil Does Bungee Jump With Cords Attached To Bum Piercings - Sakshi

మాస్కో: సాధారణంగా బంగీ జంప్‌ ఎత్తైన ప్రదేశాల నుంచి చేసే ఒక స్టంట్‌..ఇది చాల ధైర్యం ఉన్నవారు మాత్రమే చేస్తారు. ఈ జంప్‌ చేసేవారు.. సేఫ్టీ కోసం  భుజాలకు, నడుముకు తాడులను కట్టుకుంటారు. అయితే, ఈ వ్యక్తి కాస్త వెరైటీగా ఆలోచించాడు. సేఫ్టీ కోసం పెట్టే కొక్కాన్ని తన పిరుదులకు తగిలించుకున్నాడు. ఇప్పడు దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగవైరల్‌ అవుతొంది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన రష్యలో చోటుచేసుకుంది. దీనిలో సదరు వ్యక్తికి నిర్వహకులు , నడుముకు తాడును కట్టారు. అదేవిధంగా అతను నడుముకు కొక్కెలు కూడా తగిలించుకున్నాడు.  భవనంపైన  50 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా కిందకు జంప్‌ చేశాడు. అతను,కిందకు పోయే క్రమంలో గట్టిగా అరవడం మొదలు పెట్టాడు.  ఆ వ్యక్తి మాత్రం కిందకు  సేఫ్టీగానే చేరుకున్నాడు.

అయితే, అతని చర్మం ఉందా..లేక..ఊడిపోయిందా! అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు..ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతొంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ అక్కడ..దమ్ముంది’ కాబట్టి కొక్కెం తగిలించుకున్నాడు..‘ ఇదేం స్టండ్‌రాబాబు’ అంటూ కామెంట్‌లు పెడుతున్నారు.  అయితే, రష్యాలో మరొక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ప్యారాచుట్‌లో ఎగురుతున్నాడు. ఆ  ప్యారాచుట్‌  హెలికాప్టర్‌ చివరన  చిక్కుకుంది. దీంతో అది.. ఎత్తైన ప్రదేశంలో లాక్కొనిపొయింది. అక్కడ మైనస్‌20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. దీన్నిగమనించిన  గ్రామస్థులు మిలటరీ వారికి సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి అతని ప్రాణాలను కాపాడారు. 

చదవండి: లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు!

Advertisement
 
Advertisement