రెవెన్యూ క్లినిక్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి
డీఆర్వో షేఖ్ ఖాజావలి
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్‌లో సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతుందని వీటిని ప్రజలు అవసరం మేరకు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో షేఖ్ ఖాజావలి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో డీఆర్వో మాట్లాడుతూ అన్ని మండలాల తహసీల్దార్‌లు ఒకే వేదికపై అందుబాటులో ఉండడం వలన సమస్యల పరిష్కారం మరింత సులభతరమయ్యిందన్నారు. జిల్లాలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి డార్మెంటరీలో ఉన్న బ్యాంక్ అకౌంట్లను సంబంధిత శాఖల డీడీఓలు ఈకేవైసీ చేసి వెంటనే యాక్టివ్‌లోకి తీసుకురావాలని సూచించారు. కార్యాలయాల్లోని అన్ని ఫైళ్లను ఈపీటీఎస్‌లో నమోదు ప్రక్రియను నూరు శాతం వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం అందిన 217 అర్జీలను డీఆర్వోతోపాటు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ సీఈవో వి జ్యోతిబసు, డ్వామా పీడీ శంకర్ పరిశీలించారు.


