బోలెడు ఉపయోగాలతో.. స్మార్ట్‌ వాషింగ్‌ మెషీన్‌

American Startup Company Paradigm Evergreen Designed Smart Washing Machine - Sakshi

ఇది స్మార్ట్‌ వాషింగ్‌ మెషిన్‌. ఇందులో ఒకే అర ఉంటుంది. ఈ అరలోనే బట్టలు ఉతకడం, ఆరవేయడం ప్రక్రియలు చాలా తేలికగా పూర్తయిపోతాయి. అమెరికాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ‘పారాడిమ్‌ ఎవర్‌గ్రీన్‌’ కంపెనీ ఇటీవల ఈ స్మార్ట్‌ వాషింగ్‌ మెషిన్‌కు రూపకల్పన చేసింది. ఇంట్లో ఎక్కడైనా దీన్ని సౌకర్యవంతంగా పెట్టుకోవచ్చు. ఒక చోటు నుంచి మరో చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు.

మామూలు వాషింగ్‌ మెషిన్ల మాదిరిగా ఇది ఎక్కువ చోటు ఆక్రమించుకోదు. అందువల్ల చిన్న చిన్న ఇళ్లలోనూ దీనిని సులువుగా వాడుకోవచ్చు. ‘ఈవీ స్మార్ట్‌ లాండ్రీ సొల్యూషన్‌’ పేరుతో ‘పారాడిమ్‌ ఎవర్‌గ్రీన్‌’ దీనిని మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీంతో కేవలం 90 నిమిషాల్లోనే బట్టలను శుభ్రంగా ఉతికి, ఆరేసుకోవచ్చు. దీని ధర 1199 డాలర్లు (రూ.98,675) మాత్రమే!

చదవండి: సూపర్‌ గ్యాడ్జెట్‌ : బట్టతలపై వెంట్రుకలు కావాలా నాయనా!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top