Young Woman Blackmailed And Molested By Collegemate In Meerpet - Sakshi
Sakshi News home page

జానియర్‌పై లైంగిక దాడి.. వేధింపులు మితిమీరడంతో..

Jun 11 2022 8:10 AM | Updated on Jun 11 2022 8:59 AM

Young Woman Blackmailed And Molested By Collegemate in Meerpet - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

ఇద్దరి మధ్య ఫోన్‌ సంభాషణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో అమిత్‌వర్ధన్‌ బడంగ్‌పేటలోని బాలిక ఇంటికి వచ్చి నీతో మాట్లాడాలని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు.

మీర్‌పేట: పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి బాలికపై అత్యాచారం చేశాడు. వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని మీర్‌పేట పోలీసులు అరెస్టు  చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. బడంగ్‌పేటకు చెందిన బాలిక (17) బర్కత్‌పురాలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న తోటి విద్యార్థి గుడ్డె అమిత్‌వర్ధన్‌ (19) సదరు బాలికను పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానని చెప్పాడు.

మొదట నిరాకరించిన ఆమె తర్వాత సన్నిహితంగా మెలిగింది. ఇద్దరి మధ్య ఫోన్‌ సంభాషణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో అమిత్‌వర్ధన్‌ బడంగ్‌పేటలోని బాలిక ఇంటికి వచ్చి నీతో మాట్లాడాలని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు.

చదవండి: (భర్తతో విడాకులు.. మరొకరితో ప్రేమ.. విధులకు వెళ్తుండగా..)

వీడియోను తరచూ బాలికకు చూపించి తాను చెప్పినట్లు చేయాలని, లేకపోతే సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. వేధింపులు మితిమీరడంతో బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు అమిత్‌వర్ధన్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement