వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి..

Extramarital Affair: Wife Assassinated Husband In Karnataka - Sakshi

మైసూరు(కర్ణాటక): ఈ ఫోటోని చూస్తే ఎంతో అందమైన కుటుంబం అనిపిస్తుంది. కానీ అక్రమ సంబంధం రూపంలో విధికి కన్నుకుట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను తన ప్రియునితో కలసి హత మార్చిందో కసాయి భార్య. ఈ ఘోరం మైసూరులో జరిగింది.  హోటగళ్లి నివాసి మంజు (37) హత్యకు గురైన వ్యక్తి. 

గతంలో ప్రియునితో పరార్‌  
మైసూరు బోగాది నివాసి లిఖితతో 12 ఏళ్ల క్రితం మంజుకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు చిన్నారి కొడుకులు ఉన్నారు. పెళ్లయినప్పటికీ, గతంలో ఆమె ప్రియునితో కలసి వెళ్లిపోయింది. అయితే పెద్దలు రాజీ పంచాయతీ చేసి మళ్లీ భర్తకు అప్పగించారు. భార్య ప్రవర్తనను భర్త మంజు తరచూ ప్రశ్నించడంతో గొడవలు జరిగేవి.

తమకు అడ్డుగా ఉన్నాడని కక్షగట్టిన భార్య, ప్రియుడు కలిసి హత్యకు కుట్ర చేశారు. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మంజును ఇద్దరూ గొంతు పిసికి హత్య చేశారు. బుధవారం ఉదయం అనారోగ్యంతో చనిపోయాడని భార్య శోకాలు పెట్టింది. అయితే విషయం తెలిసిన విజయనగర పోలీసులు కేసు నమోదు చేసి లిఖిత ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
చదవండి: మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌..చివరికి ప్రియురాలిని చంపి, పరుపులో కుక్కి..      

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top