ఎస్‌ఎంఈ డిజిటల్‌ బ్యాంక్‌ తేవాలి

Need to create specialised SME digital bank - Sakshi

బిజ్‌2ఎక్స్‌ సీఈవో అరోరా

ముంబై: చిన్న, మధ్య తరహా సంస్థల నిధుల అవసరాలను తీర్చేందుకు ఎస్‌ఎంఈ డిజిటల్‌ బ్యాంక్‌ను కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించాలని బిజ్‌2ఎక్స్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్‌ అరోరా కోరారు.

చిన్న వ్యాపార సంస్థలు రుణాల లభ్యత సమస్య ఎదుర్కొంటున్నాయని, వాటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకమైన ఎస్‌ఎంఈ డిజిటల్‌ బ్యాంక్‌ అవసరమన్నారు. కాసా అకౌంట్లు, ఇన్‌వాయిస్, పేమెంట్‌ ప్రాసెసింగ్, కరెస్పాండెంట్‌ బ్యాంకింగ్, ఎస్‌ఎంఈ క్రెడిట్, ట్రేడ్‌ ఫైనాన్స్‌ సేవలను ఎస్‌ఎంఈ డిజిటల్‌ బ్యాంక్‌ అందించొచ్చన్నారు. బిజ్‌2ఎక్స్‌ ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌కు కస్టమైజ్డ్‌ ఆన్‌లైన్‌ లెడింగ్‌ సేవలను అందించే సాస్‌ ప్లాట్‌ఫామ్‌. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top