జియో నుంచి మరో సంచలనం..! త్వరలోనే లాంచ్‌..!

JioBook Laptop India Launch Could Be Soon Tips Alleged BIS Listing - Sakshi

టెలికాం రంగంలో సంచలనాలను నమోదు చేసిన జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీయనుంది. రిలయన్స్‌ 44 వ ఏజీఎమ్‌ సమావేశంలో అతి తక్కువ ధరకే జియో ఫోన్‌ నెక్ట్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాటుగా జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ను కూడా ప్రకటిస్తుందని అంచనా వేశారు. ఏజీఎమ్‌ సమావేశంలో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ జియోబుక్‌ గురించి ఏలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా భారత మార్కెట్లలోకి జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ను మరి కొద్ది రోజుల్లోనే లాంచ్‌ చేయనుందనే ఊహగానాలు వస్తున్నాయి.
చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్‌ ఇదే..!


ఫోట్‌కర్టసీ: ఎక్స్‌డీఏ డెవలపర్స్‌

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) వెబ్‌సైట్‌లో సర్టిఫికేషన్‌ కోసం జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ వచ్చినట్లు తెలుస్తోంది. జియో నుంచి రాబోయే ల్యాప్‌టాప్‌ మూడు వేరియంట్లు బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ సైట్‌లో కంపెనీ లిస్ట్‌ చేసింది.  కాగా జియో ల్యాప్‌టాప్‌ లాంచ్‌ డేట్‌ మాత్రం కన్ఫర్మ్‌ అవ్వలేదు. జియోబుక్‌ 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీతో వస్తుందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 4జీబీ ఎల్‌పీడీడీఆర్‌ఎక్స్‌ ర్యామ్‌, 64 జీబీ రామ్‌ స్టోరేజ్‌తో రానుంది. జియోబుక్‌ ధర ఇంకా తెలియాల్సి ఉండగా తక్కువ ధరల్లోనే జియోబుక్‌ ఉంటుందని టెక్‌ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జియోబుక్‌  సర్టిఫికేషన్‌లో భాగంగా మూడు వేరియంట్లతో NB1118QMW, NB1148QMW, NB1112MM బీఐఎస్‌ వెబ్‌సైట్‌లో లిస్ట్ ఐనట్లు టిప్‌స్టార్‌ ముకుల్‌ శర్మ వెల్లడించారు. 

జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ స్పెఫికేషన్లు అంచనా..!

  • జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ హెచ్‌డీ (1,366x768 పిక్సెల్స్) డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్‌ 664 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌
  • 4జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • మినీ హెచ్‌డీఎమ్‌ఐ కనెక్టర్‌
  • డ్యూయల్‌బ్యాండ్‌ వైఫై
  • బ్లూటూత్‌ సపోర్ట్‌
  • ప్రీ ఇన్‌స్టాల్‌డ్‌ జియో యాప్స్‌
  • మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, ఆఫీస్‌

చదవండి: Smartphone: స్మార్ట్‌ఫోన్లు పేలుతున్నాయ్‌.. జాగ్రత్తలు మన చేతుల్లో కూడా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top