Flipkart Orders: ఆర్డర్‌ చేసిన రోజే డెలివరీ.. కానీ.. | Flipkart To Soon Offer Same-Day Delivery In These 20 Cities; Check Your City Name - Sakshi
Sakshi News home page

Flipkart Orders: ఆర్డర్‌ చేసిన రోజే డెలివరీ.. కానీ..

Feb 1 2024 4:57 PM | Updated on Feb 1 2024 5:20 PM

Flipkart Orders Will Be Same Day Delivery - Sakshi

వాల్‌మార్ట్‌ నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌లో ఇకపై ఏదైనా ఆర్డర్‌ చేస్తే అదేరోజు డెలివరీ ఇచ్చేలా కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. దేశంలోని 20 ప్రధాననగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభించనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. 

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడతో పాటు అహ్మదాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, కోయంబత్తూరు, చెన్నై, దిల్లీ, గువాహటి, ఇందోర్‌, జైపుర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, లుథియానా, ముంబయి, నాగ్‌పూర్‌, పుణె, పట్నా, రాయ్‌పుర్‌, సిలిగురి నగరాల్లో ఈ సేవల్ని మొదలు పెట్టనున్నారు. త్వరలోనే ఈ కొత్త సదుపాయం ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. అయితే కచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు. రానున్న నెలల్లో దేశంలోని మరిన్ని నగరాలకు ఈ సేవలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపింది.

మధ్యాహ్నంలోపే ఆర్డర్‌..

బ్యూటీ, లైఫ్‌ స్టైల్‌, బుక్స్‌, మొబైల్స్, ఫ్యాషన్‌,   గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ విభాగాలకు చెందిన వస్తువులను బుక్‌ చేసిన రోజే అందించాలనేది లక్ష్యం. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే మధ్యాహ్నం ఒంటి గంట లోపే వస్తువులను బుక్‌ చేసుకోవాలి.

ఇదీ చదవండి: బడ్జెట్‌ 2024-25 కథనాల కోసం క్లిక్‌ చేయండి

అప్పుడు అదే రోజు అర్ధరాత్రి 12 గంటలలోపు వస్తువులు డెలివరీ చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బుక్ చేసినట్లయితే మరుసటి రోజు డెలివరీ అందుతుందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement