భారత్‌లో త్వరలో యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌  | Apple To Launch Online Store In India Soon | Sakshi
Sakshi News home page

భారత్‌లో త్వరలో యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ 

Aug 26 2020 7:57 AM | Updated on Aug 26 2020 8:00 AM

Apple To Launch Online Store In India Soon - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : అమెరికా దిగ్గజ కంపెనీ యాపిల్‌ వచ్చే రెండు నెలల్లోగా భారత్‌లో తన ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్టోర్‌ లాంచ్‌ ఈ సెప్టెంబర్‌–అక్టోబర్‌ మధ్యకాలంలోఉండొచ్చని తెలుస్తోంది. ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభోత్సవం పండుగ సీజన్లో ఉంటుందని.. దసరా, దీపావళి పండుగల డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు కంపెనీ చూస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తి ఒకరు తెలిపారు. భారత్‌లో ఆన్‌లైన్‌ స్టోర్‌ను ఈ ఏడాది చివరిలో, ఫిజికల్‌ రిటైల్‌ స్టోర్‌ వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తామని ఈ ఫిబ్రవరిలో యాపిల్‌ కంపెనీ సీఈవో టిమ్‌కుక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో యాపిల్‌ తన ఉత్పత్తులను థర్డ్‌ పార్టీ సెల్లర్లు, ఆన్‌లైన్‌ మార్కెట్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో విక్రయిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement