2023 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు వచ్చేశాయ్‌.. దక్కించుకోండి ఇలా.. | TTD 2023 Calendar And Diaries Available, Full Details Here | Sakshi
Sakshi News home page

2023 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు వచ్చేశాయ్‌.. దక్కించుకోండి ఇలా..

Nov 28 2022 5:42 PM | Updated on Nov 28 2022 5:43 PM

TTD 2023 Calendar And Diaries Available, Full Details Here - Sakshi

టీటీడీ ప్రతిష్టాత్మకంగా ముద్రించిన 2023 సంవత్సర క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి.

తిరుమల: టీటీడీ ప్రతిష్టాత్మకంగా ముద్రించిన 2023 సంవత్సర క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, లేపాక్షి ఎదుట, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతో పాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు ఉన్నాయి. 

విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపాల్లో అందుబాటులో ఉన్నాయి. 

12 పేజీల క్యాలెండర్‌ రూ.130, డీలక్స్‌ డైరీ రూ.150, చిన్న డైరీ రూ.120, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్‌ రూ.75, శ్రీవారి పెద్ద క్యాలెండర్‌ రూ.20, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్‌ రూ.20, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్‌ రూ.15, తెలుగు పంచాంగం క్యాలెండర్‌ – రూ.30గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో, తపాలా శాఖ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చు. వివరాలకు 99639 55585, 0877–2264209 నంబర్లలో సంప్రదించవచ్చు. (క్లిక్ చేయండి: పేదల ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు టాప్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement