257 బ్రాండ్స్‌కు అనుమతులిచ్చిన ఘనత చంద్రబాబుదే: ఉషశ్రీ చరణ్

సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాదరణ చూసి టీడీపీ ఓర్వలేకపోతోంది. పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఇదంతా చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు.
మంత్రి ఉషశ్రీ చరణ్ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. మహిళందరికీ సీఎం వైఎస్ జగన్ మంచి చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయంలో మద్యం ఏరులై పారింది. చంద్రబాబు ఇష్టానసారం డిస్టిలరీలకు అనుమతులిచ్చారు. 257 బ్రాండ్స్‌కు అనుమతులు ఇచ్చిన ఘనత చంద్రబాబుదే. ప్రజల్లో ఆదరణ లేకనే టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్. దోచుకో, దాచుకో, తినుకో ఇదే చంద్రబాబు పాలన అని ఎద్దేవా చేశారు.