‘కొత్తగా యూనిట్ల మంజూరుకు భవనం ఉంది’

Minister Sidiri Appalaraju Review RIMS Facilities AP - Sakshi

రిమ్స్‌: మంత్రి సీదిరి అప్పలరాజు సమీక్ష

సాక్షి, శ్రీకాకుళం: రిమ్స్‌లో కార్డియాలజీ, యురాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు ఆరుగురు స్పెషలిస్టుల నియామకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. కొత్తగా యూనిట్ల మంజూరుకు భవనం ఉందని, స్థలం, బెడ్స్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. రిమ్స్‌లో మౌలిక సదుపాయాల కల్పన అంశంపై మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత 7 నెలలుగా కోవిడ్ గురించే మాట్లాడుతున్నాం. జనరల్ మెడిసిన్‌లో 4 యూనిట్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ప్రస్తుతం కల్పించుకునే అవకాశం ఉంది. పోస్టుల అవసరం ఉంది. అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెఫ్రాలజీ విభాగం ప్రారంభించి సేవలు అందించాలి’’ అని పేర్కొన్నారు.(చదవండి: రాజధాని కోసం రాజీనామాకు సిద్ధం..)

సమీక్ష సందర్భంగా.. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణ వేణి మాట్లాడుతూ రాష్ట్ర వైద్య శాఖామంత్రి సందర్శించిన తరువాత  అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 50 నుంచి 100కు పెంచారని తెలిపారు. అదే విధంగా స్టాఫ్ నర్సుల పోస్టులు 180 కి పెరిగాయన్నారు. ‘‘సీనియర్ ఫాకల్టీ, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల అవసరం ఉంది. పెడియాట్రిక్స్, గైనకాలజీలో అదనంగా రెండు యూనిట్లు చొప్పున, జనరల్ మెడిసిన్ లో 3 యూనిట్లు అవసరం. తద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించగలం. సూపర్ స్పెషాలిటీ విభాగాలు లేవు. కార్డియాలజీ, నెఫ్రాలజీ విభాగాలలో సూపర్ స్పెషాలిటీ అవసరం. యు.జి. విద్యార్థులకు వసతి సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. పీజీలకు వసతి లేదు. సిటికి 16 స్లైడ్స్ అవసరం. క్షేత్ర స్థాయి సందర్శనలకు 50 సీటర్ల బస్సు అవసరం’’ అని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

అది అవాస్తవం: మంత్రి సీదిరి అప్పలరాజు
‘‘టీడీపీ తిత్లీ దొంగలు మత్స్యకార భరోసాపై ఫిర్యాదు చేశారు. ఈ పథకంలో అక్రమాలు జరిగాయన్నది అవాస్తవం. టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదు. మత్స్యకార గ్రామాలకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలి. అమరావతి కావాలనుకుంటే రాజీనామా చేసి పోటీకి రావాలి. పత్రికా సమావేశాలో సవాళ్లు చేయడం ఎందుకు?’’ అని మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ నేతల తీరును ఎండగట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top