చంద్రబాబు, రేవంత్‌ మధ్య చీకటి ఒప్పందం: కాకాణి | Kakani Govardhan Reddy Comments On Chandrababu And Revanth Reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, రేవంత్‌ మధ్య చీకటి ఒప్పందం: కాకాణి

Apr 22 2026 2:35 PM | Updated on Apr 22 2026 3:04 PM

Kakani Govardhan Reddy Comments On Chandrababu And Revanth Reddy

సాక్షి, నంద్యాల జిల్లా: సీమకు నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు తన స్వార్థం కోసం ఆపేసారంటూ మండిపడ్డారు. ఇక్కడ ఇంత పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం కాసేపట్లో మమ్మల్ని టీడీపీ నాయకులతో తిట్టించే పని మొదలు పెడతారు’’ అంటూ కాకాణి ధ్వజమెత్తారు.

చంద్రబాబు, రేవంత్‌ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. ప్రతి విషయంలో ఇంతకన్నా దిగజారుడు అనుకున్న ప్రతి సారి చంద్రబాబు ఇంకా దిగజారి వ్యవహరిస్తున్నారు. ఏ రోజు చంద్రబాబు అధికారంలోకి వస్తాడో ఆ రోజు నుంచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. రైతుల పేరుచెప్పుకొని నీరు-చెట్టు పేరుతో టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు. రైతుల పేరుతో దోచుకోవడం తప్ప సాయం చేయడం చంద్రబాబుకు తెలియదు. ఏ ప్రాంత ప్రజల ఆత్మభిమానం కోసం చంద్రబాబు పని చేయడు ఆయనకు ఆత్మభిమానం లేదు

..చంద్రబాబు కన్ను అర్పకుండా చెబుతాడు రాయలసీమను సస్యశ్యామలం చేస్తానంటాడు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేసి కల్లబొల్లి మాటలు చెప్పడంలో దిట్ట. చంద్రబాబు మెడలు వంచి రాయలసీమ ప్రాజెక్టులను సాధించుకుందాం అందరూ సిద్ధం కావాలి’’ అంటూ కాకాణి పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement