జింక అడ్డురావడంతో రోడ్డు ప్రమాదం
ఖానాపూర్: మండలంలోని ఇక్బాల్‌పూర్ గ్రామం మీదుగా నిర్మల్ వైపు వెళ్తున్న కారు గ్రామంలోని రోడ్డుపై మంగళవారం ప్రమాదానికి గురైంది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన చంద్రకాంత్, అతడి భార్య సూర్యలీల, కుటుంబీకులతో కలిసి కోరుట్ల నుంచి నిర్మల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న జింక కారుకు అడ్డుగా వచ్చి ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. చంద్రకాంత్, సూర్యలీల గాయపడ్డారు. ఖానాపూర్ ఎఫ్‌ఢీవో శివకుమార్, మామడ మండలం దిమ్మదూర్తి ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్‌రావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులు చంద్రకాంత్, సూర్యలీలను 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై విచారణ చేపట్టినట్లు తెలిపారు.
జింక అడ్డురావడంతో రోడ్డు ప్రమాదం


