వన జాతరకు వాకాటి

vakati karuna appoint special officer in medaram jatara - Sakshi

స్పెషల్‌ ఆఫీసర్‌గా కరుణ నియామకం   

నేడో, రేపో వెలువడనున్న ఉత్తర్వులు   

నాలుగోసారి విధుల నిర్వహణ    

మేడారం మహా జాతరకు  

అంతర్జాతీయ గుర్తింపు దిశగా యత్నం

హైదరాబాద్‌లో సీఎస్‌ ఎస్పీ సింగ్‌ సమీక్ష  

సాక్షి, వరంగల్‌ : మేడారం జాతర నిర్వహణకు ప్రత్యేకాధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వాకాటి కరుణను నియమించనున్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క–సారలమ్మ జాతరపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జాతర తేదీలు దగ్గర పడుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందులో భాగంగానే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వాకాటి కరుణను ప్రత్యేక అధికారిగా నియమించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ విభాగాలతో గురువారం హైదరాబాద్‌లో ఆయన సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా జాతర ప్రత్యేకతలు, అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞురాలైన సీనియర్‌ ఐఏఎస్‌ కరుణను ప్రత్యేకాధికారిగా నియమిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు గురువారం వెలువడనున్నట్లు సమాచారం.

నాలుగోసారి..
ప్రస్తుతం భూ పరిపాలన విభాగం డైరెక్టర్‌గా వాకాటి కరుణ హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. గతంలో మూడు జాతరల నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించారు. తొలిసారి 2010లో వరంగల్‌ జేసీ హోదాలో .. ఆ తర్వాత 2012లో రెండో సారి జేసీ హోదాలో జాతర విధులు నిర్వర్తిస్తూ తనదైన ముద్ర వేశారు. అనంతరం 2016 జాతరలో వరంగల్‌ కలెక్టర్‌ హోదాలో కరుణ అన్ని తానై వ్యవహరించారు. జాతరకు సంబంధించి నిధుల కేటాయింపు నుంచి పనుల పర్యవేక్షణ వరకు అన్ని అంశాలను ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ సకాలంలో పనులయ్యేలా వ్యవహరించారు. జాతర సందర్భంగా భక్తులు సమర్పించే బంగారం (బెల్లం) వేలం పాటను మేడారం నుంచి మణుగూరుకు తరలించడంలో పట్టుదలగా వ్యవహరించారు. ముందే మేడారం చేరుకుని జాతర ముగిసిన తర్వాత రెండు రోజుల పాటు అక్కడే ఉంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవహరించారు. 

బ్రాండ్‌ మేడారం..
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభించేలా చూడాలని, కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్‌ ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. మేడారం జాతరకు బ్రాండ్‌ ఇమే జ్‌ తెచ్చేందుకు అంతర్జాతీయ టీవీ చానల్, బ్లాగులు, సోషల్‌ మీడియాను వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీ య, పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలను రూపొందిం చా లన్నారు. విదేశీ యాత్రికుల కోసం అత్యున్నత సదుపాయాలతో ప్రత్యే క నివాసాలను ఏర్పాటు చేయాలన్నారు. సాంస్కృతిక శాఖలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి, జాతర కార్యక్రమాలను పర్యవేక్షించాలని చెప్పా రు. 

జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులు, సెక్రటరీలు, గిరిజన పార్లమెంట్‌ సభ్యులను ప్ర త్యేకంగా ఆహ్వానించాలని ఆదేశించారు. జాతర కోసం వచ్చే ముఖ్య అతిథులను తగు ప్రొటోకాల్‌తో ఆహ్వానించాలని సూచించారు. మేడారంలో పారిశుద్ధ్య నిర్వహణకు మునిసిపల్‌ శాఖ ద్వారా తగు సిబ్బంది ని నియమించాలని, సరిపడా అత్యాధునిక మరుగుదొడ్లను నిర్మించాలన్నారు. సాంస్కృతిక, దేవాదాయశాఖ అధికారులు జాతర ఏర్పాట్లపై ప్రత్యేక బ్రోచర్‌ను విడుదల చేయాలని, జాతరకు వచ్చు భక్తులకు హెలికాప్టర్‌ సేవలందేలా చూడాలన్నారు.ఏ ఒక్క భక్తుడికీ ఎ టువంటి ఇబ్బంది కలగకుండా భద్రత, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎస్‌ ఎస్పీ సింగ్‌ సూచించారు. 

Read latest Warangal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top