మోడీతో అమెరికా రాయబారి భేటీ | US envoy Nancy Powell meets Narendra Modi | Sakshi
Sakshi News home page

మోడీతో అమెరికా రాయబారి భేటీ

Feb 13 2014 10:39 AM | Updated on Aug 24 2018 6:33 PM

మోడీతో అమెరికా రాయబారి భేటీ - Sakshi

మోడీతో అమెరికా రాయబారి భేటీ

గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ సమావేశమయ్యారు.

గాంధీనగర్: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ సమావేశమయ్యారు. ఈ ఉదయం గాంధీనగర్లోని మోడీ నివాసానికి చేరుకుని ఆయనతో నాన్సీ పావెల్ భేటీ అయ్యారు. తొమ్మిదేళ్ల కిందట మోడీపై విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన మోడీ సారథ్యంలో ఎన్డీఏ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడించడంతో మోడీతో సంబంధాలు పునరుద్ధరించాలని అమెరికా భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మోడీపై తమ వైఖరి మారలేదని అమెరికా నిన్న స్పష్టం చేసింది. 2002 నాటి గోధ్రా ఘటన అనంతరం చెలరేగిన అల్లర్లను కారణంగా చూపి 2005లో మోడీకి దౌత్య వీసా ఇచ్చేందుకు నిరాకరించడంతోపాటు టూరిస్ట్, బిజినెస్ వీసాలను అమెరికా ఉపసంహరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement