ఆగ్రా రైల్వే స్టేషన్‌ వద్ద జంట పేలుళ్లు | Two explosions in Agra | Sakshi
Sakshi News home page

ఆగ్రా రైల్వే స్టేషన్‌ వద్ద జంట పేలుళ్లు

Published Sat, Mar 18 2017 11:18 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM

ఆగ్రా రైల్వే స్టేషన్‌ వద్ద జంట పేలుళ్లు

ఆగ్రా రైల్వే స్టేషన్‌ వద్ద జంట పేలుళ్లు

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్‌ సమీపంలో శనివారం ఉదయం జంట పేలుళ్లు చోటుచేసుకోవడం కలకలం రేపింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్‌ సమీపంలో శనివారం ఉదయం జంట పేలుళ్లు చోటుచేసుకోవడం కలకలం రేపింది.  మొదట ఓ రైల్వే ట్రాక్‌ సమీపంలోని చెత్తకుండీ వద్ద పేలుడు చోటుచేసుకోగా.. ఆ తర్వాత సమీపంలోని ఓ నివాసగృహం వద్ద మరో పేలుడు చోటుచేసుకుంది. అంతేకాకుండా రైల్వేట్రాక్‌ వద్ద ఓ బెదిరింపు లేఖ కూడా లభ్యం అయింది. అయితే, ఇవి తక్కువ తీవ్రత కలిగిన బాంబులు కావడంతో పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.

 సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుపు, ఇటీవల లక్నోలో ఐఎస్‌ ఉగ్రవాది కాల్చివేత తదితర ఘటనల నేపథ్యంలో ఈ జంట పేలుళ్లు పోలీసుల్లో కలవరం రేపాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన వెనుక ఉగ్రవాద చర్య ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement