ప్రభుత్వోద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
ప్రభుత్వోద్యోగులకు కేంద్రప్రభుత్వం శుభవార్త అందించింది.
న్యూఢిల్లీ : ప్రభుత్వోద్యోగులకు కేంద్రప్రభుత్వం శుభవార్త అందించింది. పెన్షన్ ఫండ్ నిబంధలను కేంద్రప్రభుత్వం సరళతరం చేసింది. కుటుంబ ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వోద్యోగులు తమ పెన్షన్ ఫండ్ను విత్డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. 12 నెలల చెల్లింపులను లేదా క్రెడిట్ చేసిన దానిలో నాలిగింట మూడు వంతులను ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించింది. ముందస్తు నిబంధనల మేరకు కేవలం మూడు నెలల చెల్లింపులను లేదా సగం మొత్తాన్ని మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశమండేది.
సరళతరం చేసిన ఈ నిబంధనలతో 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు నగదును విత్ డ్రా చేసుకునేందుకు అర్హులవుతారు. అంతకముందు ఈ సర్వీసు పరిమితి 15 ఏళ్ల వరకు ఉండేది. చదువులకు, అనారోగ్య ఖర్చులకు, కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ కొనడానికి పెన్షన్ ఫండ్ ను విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రైమరీ, సెకండరీ, హైయర్ ఎడ్యుకేషన్ల కోసం కూడా ఉద్యోగులు ఇక పెన్షన్ ఫండ్ విత్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. గృహరుణాల తిరిగి చెల్లింపులకు, భూమి కొనుగోలుకు, ప్రస్తుత ఇంటిని ఆధునీకరణకు అయ్యేందుకు అయ్యే ఖర్చుల కోసం ఇప్పడివరకు ఉన్న విత్ డ్రా పరిమితిని ప్రభుత్వం పెంచినట్టు తెలిసింది. కారు రుణాల తిరిగి చెల్లింపులకు, కారు మరమ్మత్తులకు ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.