ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

Published Wed, Mar 15 2017 3:56 PM

Markets end marginally lower ahead of Fed rate decision; IT stocks drag

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.  సెన్సెక్స్‌ 44 పాయింట్ల నష్టంతో 29398 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 9084  వద్ద ముగిశాయి.  రోజు మొత్తం కన్సాలిడేషన్‌ బాటలో ప్రతికూలంగా సాగిన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి.
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షలో పావు శాతం వడ్డీ పెంపు ఉండొచ్చన్న అంచనాలు బలపడిన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు వ్యాఖ్యానించారు.
ఫెడ్ రేట్లను పెంచనుందనే అంచనాలనేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో అయిదు రాష్ట్రాల్లో బీజేపీ  హవాతో రికార్డ్‌ స్థాయిలను టచ్‌ చేసిన సెన్సెక్స్‌, నిఫ్టీ  స్వల్పనష్టాలతో అప్రమత్తంగా ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి  భారీగా నెలకొంది.  దీంతో ఐటీ 1.8శాతం నష్టపోగా, టీసీఎస్‌,ఇన్ఫోసిస్‌ 2 శాతం దిగజారాయి. కాగా మిడ్‌ క్యాప్‌ , స్మాల్‌ క్యాప్‌ షేర్లు  మంచి ప్రదర్శన కనబర్చాయి. మిగిలిన అన్ని ఇండెక్సులూ లాభపడగా.. పీఎస్‌యూ బ్యాంక్‌, ఆటో లాభపడ్డాయి.  ఐడియా 9శాతం, హీరో మోటా కార్ప్‌, టాటాస్టీల్‌, ఆర్‌ ఐఎల్‌, టాటా మెటార్స్‌ లాభపడగా,  పీవీఆర్‌  4శాతం నష్టపోయింది. అలాగే   హెచ్‌యుఎల్‌, విప్రో  ఐసీఐసీఐ కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ నష్టపోయిన వాటిల్లోఉన్నాయి.
మరోవైపు డాలర్‌  మారకంలో రూపాయి  16న నెలల గరిష్టాన్ని తాకింది. 0.20పైసలు లాభపడి 65.64 వద్ద రూ. 65ల ఎగువకు చేరింది.  అటు ఫెడ్‌ అంచనాలతో పుత్తడి బలహీనత కొనసాగుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో పది గ్రా.పసిడి రూ. 101లు పతనమై  రూ. 27,975వద్ద ఉంది.


 

Advertisement
Advertisement