గుర్రుగానే ఉన్న అద్వానీ, బుజ్జగింపు యత్నాలు | BJP leaders Sushma Swaraj, Ananth Kumar meets Advani | Sakshi
Sakshi News home page

గుర్రుగానే ఉన్న అద్వానీ, బుజ్జగింపు యత్నాలు

Sep 14 2013 3:18 PM | Updated on Mar 29 2019 9:18 PM

గుర్రుగానే ఉన్న అద్వానీ, బుజ్జగింపు యత్నాలు - Sakshi

గుర్రుగానే ఉన్న అద్వానీ, బుజ్జగింపు యత్నాలు

నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ అలక వహించిన అగ్రనేత అద్వానీని సముదాయించేందు భారతీయ జనతా పార్టీ ముమ్మర యత్నాలు చేస్తోంది.

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ అలక వహించిన అగ్రనేత అద్వానీని సముదాయించేందు భారతీయ జనతా పార్టీ ముమ్మర యత్నాలు చేస్తోంది.  పార్టీ సీనియర్‌ నేతలు సుష్మా స్వరాజ్‌, అనంతకుమార్‌, బల్బీర్‌ పుంజ్‌ తదితరులు శనివారం అద్వానీ నివాసానికి వెళ్ళి మూడు గంటలకు పైగా చర్చలు జరిపారు.

అనంతరం బయటకు వచ్చిన సుష్మ... మోడీ అభ్యర్ధిత్వంపై పార్టీలో ఎవ్వరికీ విభేదాలు లేవన్నారు. ఎవ్వరూ అసంతృప్తి చెందలేదని చెప్పారు. అయితే అద్వానీ మాత్రం ఇంకా గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. ఎందువల్ల ఆయన మోడీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించారో కూడా ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement