షాకింగ్‌: పాకిస్థాన్‌తో మ్యాచులు ఆడబోం! | Afghanistan cancels friendly matches with Pakistan | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: పాకిస్థాన్‌తో మ్యాచులు ఆడబోం!

Jun 1 2017 9:33 AM | Updated on Sep 5 2017 12:34 PM

షాకింగ్‌: పాకిస్థాన్‌తో మ్యాచులు ఆడబోం!

షాకింగ్‌: పాకిస్థాన్‌తో మ్యాచులు ఆడబోం!

పాకిస్థాన్‌ జట్టుతో మ్యాచులు ఆడబోమని, అలాగే ఆ జట్టుతో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నామని..

  • స్నేహపూర్వక మ్యాచులు రద్దు
  • తెగేసి చెప్పిన ఏసీబీ

  • కాబూల్‌: అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో జరిగిన తాజా ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఆ దేశ క్రికెట్‌ బోర్డు తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంది. పొరుగుదేశం పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. పాకిస్థాన్‌ జట్టుతో తలపెట్టిన స్నేహపూర్వక మ్యాచులను రద్దు చేస్తున్నామని, అలాగే గతంలో ఉమ్మడి క్రికెట్‌ సంబంధాల కోసం గతంలో చేసుకున్న ఒప్పందాల నుంచి కూడా బయటకు వస్తున్నామని అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) ట్విట్టర్‌లో స్పష్టం చేసింది.

    కాబూల్‌లోని దౌత్యప్రాంతంలో బుధవారం జరిగిన భారీ బాంబు పేలుడులో 90మందికిపైగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వందలాది మంది గాయపడ్డారు. ఈ పేలుడుకు సూత్రధారి పాకిస్థాన్‌లోని హక్కానీ నెట్‌వర్క్‌యేనని, పాక్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ సహకారంతో ఈ దుర్మార్గానికి పాల్పడిందని అఫ్ఘాన్‌ జాతీయ సెక్యూరిటీ డైరెక్టరేట్‌ (ఎన్డీఎస్‌) స్పష్టం చేసింది. ఈ కాబూల్‌లోని జర్మనీ, ఇరాన్‌ ఎంబసీలకు అత్యంత సమీపంలో జరిగిన ఈ పేలుడు వెనుక పాక్‌ హస్తముందని తేలడంతో ఆ దేశంతో ఇక క్రికెట్‌ ఆడకూడదని ఏసీబీ నిర్ణయం తీసుకుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement