పేదలందరికీ పక్కా | to the target that is Comprehensive survey, the latest applications | Sakshi
Sakshi News home page

పేదలందరికీ పక్కా

Oct 16 2014 2:53 AM | Updated on Sep 2 2017 2:54 PM

పేదలందరికీ పక్కా

పేదలందరికీ పక్కా

పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఇందులో ఎలాంటి అపోహలొద్దని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు.

* అపోహలొద్దు.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
* సమగ్ర సర్వే, తాజా దరఖాస్తుల లక్ష్యమదే
* ఐఏఎస్ అధికారుల కొరతతోనే ఇబ్బందులు
* అయినా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
* నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట రూరల్: పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఇందులో ఎలాంటి అపోహలొద్దని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, అర్హులకే సంక్షేమ ఫలాలు అందివ్వాలన్న లక్ష్యంతోనే సర్కార్ ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ, ఇటీవలే నిర్వహించిన సమగ్ర సర్వే లక్ష్యం కూడా అదేనన్నారు. లబ్ధిదారుల ఎంపికలో  ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించలేదన్నారు.  ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా హరీష్‌రావు కోరారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణకు ఐఏఎస్‌ల కొరత ఎక్కువగా ఉందని, అందువల్లే సంక్షేమ పథకాల ప్రారంభంలో జాప్యం జరుగుతోందన్నారు. అయినప్పటికీ త్వరలోనే ఎన్నికల ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.  
 
సిద్దిపేట జిల్లాకే ఆదర్శం
జిల్లాలో 90 నిర్మల్ పురస్కార్ పొందిన గ్రామాలుంటే, అందులో 50 గ్రామాలు సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎన్నికై జిల్లాకే సిద్దిపేట ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే గ్రామాల్లోని ఇళ్లల్లో, వీధి దీపాల్లో ఎర్రబుగ్గలు తొలగించి, సీఎఫ్‌ఎల్ బల్బులు వాడాలన్నారు. దీంతో విద్యుత్‌ను ఆదా చేయడమే కాక బిల్లులు కూడా తక్కువగా వస్తాయన్నారు. గ్రామాల్లో ఇంటి పన్ను, నల్ల బిల్లు వసూల్లో సర్పంచ్‌లు చాలా వెనకబడి ఉన్నారని, దాన్ని అధిగమించాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు రూ.2 వేల కోట్లు కేటాయించారని త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, జెడ్పీటీసీ గ్యార వజ్రవ్వ, ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఉపాధ్యక్షులు శ్రీహరిగౌడ్, ఎంపీడీఓ ప్రభాకర్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర అధికారులు తదితరలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement