విద్యార్థుల ఇంటికే మధ్యాహ్న భోజనం సరుకులు

Telangana Government Tries To Provide Afternoon Meals For The Students - Sakshi

లేదంటే ఆ మేరకు వెచ్చించే డబ్బులు చెల్లింపు

కేంద్రం ఆదేశాల మేరకు విద్యాశాఖ ప్రతిపాదనలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పొందుతున్న విద్యార్థులకు ఇక ఇంటికే మధాహ్న భోజనం అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆదేశాలను జారీచేసింది. వాటికనుగుణంగా చేపట్టాల్సి న చర్యలపై విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపా దనలను పంపింది. విద్యార్థులకు బియ్యం, కూరగాయలు, నూనెలు, కోడిగుడ్లకు సం బంధించిన వాటిని గ్రామ పంచాయతీల ద్వారా సరఫరా చేయాలని భావిస్తోంది. అది సాధ్యం కాని పరిస్థితుల్లో వాటికి వెచ్చించే మొ త్తం డబ్బును పాఠశాలలు మూసివేసిన రోజులకు లెక్కిం చి విద్యార్థులకు అందజేయాలని భావిస్తోంది. అయితే విద్యాశాఖ పంపి న ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు 11,37,547 మంది, 6 నుంచి 8వ తరగతి వరకు 6,58,409 మంది, 9, 10 తరగతుల విద్యార్థులు 4,77,087 మంది ఉన్నారు. వారందరికి ఒక్కొక్కరికి ఈ మొత్తాన్ని చెల్లించనున్నారు.

ప్రస్తుతం విద్యార్థులపై వెచ్చిస్తున్నదిదే.. 
1 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు రోజు 100 గ్రాముల బియ్యం, 6 నుంచి పదో తరగ తి వరకున్న విద్యార్థులకు 150 గ్రాముల బి య్యం ఇవ్వనున్నారు. వాటిని ఈనెల 16 నుంచి 31 వరకు లెక్కించి మొత్తంగా ఒక్కో విద్యార్థికి అందించనున్నారు. లేదా అం దుకు సమానంగా డబ్బులు చెల్లించనున్నారు. అలాగే ప్రాథమిక పాఠశా లల్లో భోజనం వండి పెట్టేందుకు అవసరమైన కూరగాయలు, వంట నూనెల కింద మధ్యాహ్న భోజనం కార్మికులకు ఒక్కో విద్యార్థిపై చెల్లిస్తున్న రూ.4.48, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై చెల్లిస్తున్న రూ.6.71లను ఒక్కో విద్యార్థికి లెక్కించి అందజేస్తారు. అలాగే వారికి మూడు రోజులకు ఒకటి చొప్పున కోడి గుడ్లు అందించేందుకు ఒక్కో గుడ్డుకు రూ. 4 చొప్పున లెక్కించి అందజేయనున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top