
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ మంటలు చల్లారడం లేదు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శిని కలవాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు.
చదవండి : బయటపడుతున్న ఇంటర్ బోర్డు లీలలు..
విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యవహించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డ్ వద్దకు భారీగా చేరుకొని ఆందోళనకు దిగారు. ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీని వేసిన సంగతి తెలిసిందే.