నగరంలోని హయత్‌నగర్‌లో వీధి కుక్కలు మరోసారి విజృంభించాయి.
హయత్‌నగర్: నగరంలోని హయత్‌నగర్‌లో వీధి కుక్కలు మరోసారి విజృంభించాయి. సోమవారం హయత్‌నగర్‌లో కుక్కలు ఒక వృద్ధుడు, ఇద్దరు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కాగా, గత వారంలో హయత్‌నగర్ పరిధిలో కుక్కల దాడిలో 14 మంది గాయపడిన విషయం తెలిసిందే. నిరంతరం కాలనీల్లో కుక్కలు దాడి చేస్తున్నా మున్సిపల్ అధికారులు స్పందించడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.