
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్–తిరుపతి (7429/7428) కి ప్రత్యే క రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు శుక్రవారం సాయంత్రం 7.50కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10కి తిరుపతి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో 10వ తేదీ సాయంత్రం 5గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కి హైదరాబాద్ చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.