‘కాళేశ్వరం’ ఇంజనీర్లకు ప్రమోషన్‌

Kaleshwaram Project Engineers Got Promotions - Sakshi

ప్రభుత్వ ప్రతిపాదనలు సిద్ధం

రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన!

కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ఐదుగురు ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్లకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజనీర్లు కుటుంబాలకు దూరంగా ఉండి రాత్రింబవళ్లు శ్రమించి లక్ష్యానికి అనుగుణంగా కృషి చేసినందుకు ప్రభుత్వం స్పెషల్‌ ప్రమోషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లింకు–1లోని మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బీవీ రమణారెడ్డికి ఎస్‌ఈగా, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎం.రాజుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా, అన్నారం సరస్వతీ బ్యారేజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎ.యాదగిరికి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పి.రవిచంద్రకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పదోన్నతి ఇవ్వనున్నారు. అలాగే లింకు–2 పరిధిలోని నంది, గాయత్రి పంపుహౌస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నూనె శ్రీధర్‌కు ఎస్‌ఈగా ప్రమోషన్‌ రానుంది. వీరందరికి ఒక నెల జీతం లేదా ఒక ఇంక్రిమెంట్‌ను ఇవ్వనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top