జోరుగా ఇంటింటి ప్రచారం

Congress Campaign Home To Home, Mahabubnagar - Sakshi

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ

పేదలకు ఉచిత కరెంట్, ఏడు కిలోల సన్నబియ్యం

వృద్ధాప్య పింఛన్లను రూ.2 వేలకు, వికలాంగుల పింఛన్లను రూ.3 వేలకు పెంచుతాం..

సాక్షి, చిన్నచింతకుంట: మండలంలోని అల్లీపురం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లి ప్రతిఒక్కరికి తెలియపర్చి టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడగొట్టడమే తమ లక్ష్యమన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయకపోగ ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేశామని ప్రగల్భాలు పలకడం పరిపాటిగా మారిందన్నారు.

  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసపూరితమైన మాటలు నమ్మవద్దని కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వేణుగోపాల్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు ధనంజయ్, యూత్‌ కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు వెంకటేష్, రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి అక్బర్, నాయకులు రహ్మత్, సురేష్, యూత్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీ కార్యదర్శులు మహిపాల్‌రెడ్డి, సురేష్, ఖాజామైనొద్దీన్, గ్రామ అధ్యక్షుడు కృష్ణయ్య, మహేందర్‌రెడ్డి, నర్సింహ, దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి 
భూత్పూర్‌: కాంగ్రె‹స్‌ పార్టీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహరెడ్డి అన్నారు. మండలంలోని హస్నాపూర్‌లో గడప గడపకు కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరిగి మేనిఫెస్టోపై వివరించారు. చేయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ, పేదలకు ఉచిత కరెంట్, ఏడు కిలోల సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవరకద్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఫసియొద్దీన్, హర్యానాయక్, యూత్‌ కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు శ్ర్రీకాంత్‌రెడ్డి, దేవరకద్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు సాధిక్, నాయకులు సంజీవ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 

అడ్డాకుల: మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను ఓటర్లకు వివరించి హస్తం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, వృద్ధాప్య పింఛన్లను రూ.2 వేలకు, వికలాంగుల పింఛన్లను రూ.3 వేలకు పెంచనున్నట్లు ఓటర్లకు వివరించి మద్దతు కూడగడుతున్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగదీశ్వర్, మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, మండల కోఆప్షన్‌ సయ్యద్‌షఫి, రిటైర్డ్‌ ఏఈ లక్ష్మీనారాయణ, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలరాజు, నాయకులు దశరత్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, సాయిరెడ్డి, వెంకట్‌రెడ్డి, బుచ్చన్న, రవిసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top