ఎన్నికల లెక్కలు ఇలా...

Campaign Expenditures  And Legislative Election Outcomes - Sakshi

 అభ్యర్థుల వస్తువులు, వాహనాల ధరలు ఖరారు 

  వ్యాపారుల కొటేషన్ల ఆధారంగా నిర్ధారించిన అధికారులు 

 గరిష్టంగా రూ.28 లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం 

 అన్ని అంశాలు లెక్కలోకి వచ్చేలా అధికారుల పరిశీలన  

వనపర్తి : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కోసం వినియోగించే. వస్తువులు, వాహనాల ధరలను ఇటీవల అధికారులు ఖరారు చేశారు. గతంలో కంటే.. ఈ ధరలు పెరిగినట్లు రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వాహనాలు, పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, వాహనాలు, హోర్డింగ్‌లు, మైక్‌ సెట్లు, స్పీకర్లు, మౌత్‌పీస్‌ తదతర వస్తువులతో పాటు నాలుగు, మూడు, రెండు చక్రాలను ఉపయోగిస్తారు. ఈ మేరకు ఏది ఉపయోగిస్తే ఎంత ధర నిర్ణయిస్తారనే విషయాన్ని పలు వ్యాపార సంస్థల కొటేషన్లు స్వీకరించిన అధికారులు తుది ధరలు ఖరారు చేశారు. ఈ ధరల పట్టిక ప్రకారం.. అభ్యర్థుల లెక్కలు పరిశీలించే నోడల్‌ అధికారి, కమిటీ సభ్యులు వారి ఎన్నికల ఖర్చు నమోదు చేస్తారు.
గతంతో పోలిస్తే ఎక్కువే.. 
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఒక్కో అభ్యర్థి పోలింగ్‌ పూర్తయ్యే నాటికి రూ. 28 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయరాదు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిర్ణయించిన ధరల కంటే ప్రస్తుతం నిర్ణయించిన ధరలు ఎక్కువేనని తెలుస్తోంది. కాగా కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసిన మరునాటి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇతర బీఎల్‌ఎఫ్, స్వతంత్య్ర అభ్యర్థులు కొన్ని రోజులుగా ప్రచారం చేస్తుండగా.. మహాకూటమి నుంచి టికెట్లు ఖరారు అనుకున్న వారు మాత్రం గ్రామాల్లో పర్యటిస్తున్నారు. 
 ఎక్కడ సభ, సమావేశాలు నిర్వహించినా లెక్కలోకే... 
అభ్యర్థులు సభలు, సమావేశాలు ఎక్కడ నిర్వహించినా అక్కడ ఏర్పాట్ల ఖర్చు మొత్తం సదరు అభ్యర్థి పద్దులోకే వస్తుంది. ఇక్కడ ఉపయోగించిన వస్తువులు, స్పీకర్లు, కుర్చీలు, టేబుళ్లు, ఫంక్షన్‌ హాల్, వాహనాలు, భోజనాలు, టీ, టిఫిన్స్‌తో సహా అన్ని ఖర్చులు నమోదు చేస్తాం. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతిరోజూ అభ్యర్థులు రోజువారీ ఖర్చుల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అన్నింటినీ కలిపి జిల్లా ఎన్నికల అధికారికి అందజేస్తాం. 
– స్వామి, ఎన్నికల ఖర్చుల విభాగం నోడల్‌ అధికారి, వనపర్తి 

మైక్రోఫోన్‌తో కూడిన లౌడ్‌స్పీకర్‌ (ఒక్క రోజుకు) 
100 వాట్స్‌        రూ.700 
250 వాట్స్‌        రూ.1,700 

వేదిక ఏర్పాటు కోసం (ఒక్క రోజుకు) 
4 ఫీట్లు        రూ.120 
6 బై 120        రూ.750 
36 బై 36 టెంట్‌    రూ.2,000 
18 బై 36 టెంట్‌    రూ.800 

క్లాత్‌ జెండాలు 
ప్రతీ ఫీటు రూ.65 
ప్లాస్టిక్‌ జెండాలు 
ప్రతి కేజీకు రూ.400 
హ్యాండ్‌ బిల్లు పేపర్స్‌ 
వెయ్యికి రూ.900 

పోస్టర్లు 
వెయ్యికి రూ.7,600 
పది వేలకు రూ.3,900 
యాభై వేలకు రూ.3,200 
లక్షకు రూ.3,050 

హోర్డింగ్స్‌ 
20 బై 30        రూ.11,500 
20 బై 20        రూ.9,800 

ఉడెన్‌ కటౌట్‌ 
ప్రతీ స్వే్కర్‌ ఫీట్‌కు    రూ.95 
క్లాత్, ప్లాస్టిక్‌ కటౌట్లు ప్రతీ స్క్వేర్‌ ఫీట్‌కు    రూ.70 

వీడియో క్యాసెట్లు, సీడీలు  
ప్రతి నెలా            రూ.10వేలు 
లోకల్‌ చానల్‌ (ప్రతి రోజు)     రూ.750 
ఆడియో క్యాసెట్లు, సీడీలు  
ఒక్క రికార్డ్‌కు రూ.5,500 
ఆటోలో ఆడియో ప్రచారం (ఒక్క రోజుకు) రూ.2,400 
ఆర్చీలు వంద స్వే్కర్‌ ఫీట్లు     రూ.95 

వాహనాలు 
జీపు, టెంపో, ట్రక్కర్‌ (డీజిల్‌ లేకుండా ఒక్కరోజుకు)        రూ.1,600  
సుమో, క్వాలిస్, ఇన్నోవా (డీజిల్‌ లేకుండా ఒక్క రోజుకు)        రూ.2,000 
కార్లు (డీజిల్‌ లేకుండా ఒక్క రోజుకు)     రూ.1,500 
మూడుచక్రాల వాహనాలు (ఒక్కటి)    రూ.1.200 
సైకిల్, రిక్షాలు        రూ.600 

హోటల్‌ రూంలు, గెస్ట్‌ హౌస్‌లు  
డీలక్స్‌ ఏసీ గది (ఒక్క రోజుకు)     రూ.1,350 
నార్మల్‌ నాన్‌ ఏసీ గది (ఒక్క రోజుకు) రూ.800 

ఫర్నీచర్‌ (ఒక్క రోజుకు)  
ప్లాస్టిక్‌ చైర్‌    రూ.7 
వీఐపీ చైర్‌    రూ.60 
సోఫా    రూ.500 
టేబుల్‌    రూ.90   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top