ఆర్టీసీ అధికారులు పలు మార్గాల్లో అదనపు బస్సులు నడిపేందుకు నిర్ణయించారు.
తాండూరు: ఆర్టీసీ అధికారులు పలు మార్గాల్లో అదనపు బస్సులు నడిపేందుకు నిర్ణయించారు. మరికొన్ని రూట్‌లో బస్సులను పునరుద్ధరించనున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి శ్రీశైలానికి మూడు అదనపు బస్సులను నడపనున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి శ్రీశైలానికి ఉదయం 6, 7గంటలకు బస్సులు నడుస్తున్నాయి. వీటికి అదనంగా ఉదయం 8గంటలకు మధ్యాహ్నం 12గంటలకు, 2గంటలకు బస్సులు శ్రీశైలానికి బయలుదేరుతాయి.
రోడ్డు బాగా లేనందున తాండూరు నుంచి జహీరాబాద్‌కు బస్సును నెల రోజుల క్రితం అధికారులు నిలిపివేశారు. రోడ్డుకు మరమ్మతులు చేయడంలో ఇందూరు మీదుగా జహీరాబాద్‌కు బస్సును పునరుద్ధరించనున్నారు. ఈ బస్సు గురువారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. తాండూరు నుంచి రోంపల్లి, బంట్వారం, కల్‌కోడ,మర్పల్లి గ్రామాల మీదుగా సదాశివపేట్ వరకు ఉదయం 7.30గంటలకు, మధ్యాహ్నం 1.35గంటలకు బస్సు నడపనున్నారు. అదేవిధంగా తాండూరు నుంచి రోంపల్లి బంట్వారం, తోర్మామిడి, కోహీర్ గ్రామాల మీదుగా ఉదయం 8గంటలకు జహీరాబాద్‌కు మరో బస్సును నడపనున్నారు. ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పోలేపల్లి జాతర కోసం తాండూరు నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఆయా రూట్‌లో ప్రయాణీకులకు మెరుగైన సేవలందించేందుకు బస్సులను నడపనున్నట్టు తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ బుధవారం చెప్పారు.