అత్తను హత్య చేసిన అల్లుడు | son in law murdered by Aunt | Sakshi
Sakshi News home page

అత్తను హత్య చేసిన అల్లుడు

Nov 29 2016 3:12 AM | Updated on Sep 2 2018 4:37 PM

చికెన్ రుచిగా వండలేదనే కారణంతో సొంత అత్తను అల్లుడు హత్య చేసిన సంఘటన ఆవలహళ్లి పోలీస్‌స్టేషన్

 బెంగళూరు (కేఆర్ పురం)  :  చికెన్ రుచిగా వండలేదనే కారణంతో సొంత అత్తను అల్లుడు హత్య చేసిన సంఘటన ఆవలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన వీరప్ప కృష్ణరాజపురంలోని కేఆర్ ఇన్ హోటల్‌లో సూపర్‌వైజర్ పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతను కిత్తగనూరుకు చెందిన మునిరత్నమ్మ (50) కుమార్తె సౌమ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
 
 ఈ నేపథ్యంలో వీరప్ప తన అత్త ఇంటిలోనే నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉంటే మద్యానికి బానిసైన వీరప్ప నిత్యం తాగి వచ్చి అత్తతో గొడవకు దిగేవాడు. ఆదివారం చికెన్ సరిగా వండలేదని అత్తతో గొడవకు దిగాడు. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని సర్ది చెప్పి పంపారు. దీంతో అల్లుడిని బయటే ఉంచి వాకిలి వేసుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇంటి పొగ గొట్టం నుంచి ఇంట్లోకి దిగిన వీరప్ప భార్య సౌమ్య సహాయంతో మునిరత్నమ్మ గొంతునులిమి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement