నా ప్రమాణ స్వీకారానికి రండి.. | Narendra Modi invites Pakistani prime minister Nawaz Sharif | Sakshi
Sakshi News home page

నా ప్రమాణ స్వీకారానికి రండి..

May 22 2014 1:31 AM | Updated on Jul 11 2019 8:48 PM

నా ప్రమాణ స్వీకారానికి రండి.. - Sakshi

నా ప్రమాణ స్వీకారానికి రండి..

ఈ నెల 26వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి.. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు మహీందరాజపక్స, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలు సహా సార్క్ దేశాధినేతలందరినీ ఆహ్వానించారు.

సార్క్ దేశాధినేతలకు మోడీ ఆహ్వానం
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి.. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు మహీందరాజపక్స, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలు సహా సార్క్ దేశాధినేతలందరినీ ఆహ్వానించారు. భారత ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించటం ఇదే తొలిసారి. మోడీ తరఫున విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ ఆయా దేశాల విదేశాంగ శాఖలకు ఈ మేరకు ఆహ్వాన లేఖలు పంపించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి బుధవారం ఢిల్లీలో వెల్లడించారు. అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు కర్జాయ్, భూటాన్ ప్రధాని ేటోబ్గే, నేపాల్ ప్రధాని సుశీల్‌క ొయిరాలా, మాల్దీవుల అధ్యక్షుడు గయూమ్‌లు  ఆహ్వానితుల్లో ఉన్నారు.  

 ‘వైవాహిక స్థితి’పై మోడీకి పోలీసుల క్లీన్‌చిట్
 అహ్మదాబాద్: వైవాహిక స్థితి వెల్లడించకపోవడానికి సంబంధించి  మోడీకి గుజరాత్ పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చారు. 2012 నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో వైవాహిక స్థితిని వెల్లడించకపోవడం ద్వారా మోడీ ఎలాంటి నేరానికీ పాల్పడలేదంటూ బుధవారం కోర్టుకు సమర్పించిన నివేదికలో గుజరాత్ పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement